KA Movie Review 2024
Director : Sandeep & Sujith
Genre : Thriller
Rating: ★★★★☆ (8.2/10)
KA: ఒక అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్
కొన్ని సినిమాలు మనల్ని ఆలోచింపజేస్తాయి, కొన్ని సినిమాలు మనల్ని భయపెడతాయి, మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ అరుదైన సినిమాలే మనల్ని అన్నింటినీ చేస్తాయి. అలాంటి అరుదైన సినిమాల్లో ఒకటే “KA” సినిమా.
కథ విషయానికి వస్తె : అభినయ్ వాసుదేవ్ అనే వ్యక్తి కృష్ణగిరి అనే ఒక పల్లెటూరిలో పోస్ట్ మాన్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ ఊరిలో వాళ్ళకి వచ్చిన లెటర్స్ అన్నీ తెరిచి చదువుతూ ఉంటాడు కానీ ఒక లెటర్లో ఒక రహస్యం ఉంటుంది. ఆ లెటర్ లో ఏముంది అని తెలుసుకోవడానికి అతని జీవితంలోకి ఒక రహస్యమైన మాస్క్ మాన్ ప్రవేశిస్తాడు. అసలు ఆ లెటర్ లో ఏముంది? ఆ మాస్క్ మాన్ ఎందుకు వాసుదేవ్ వెనకాల పడుతున్నాడు? అసలు వాసుదేవ్ ఎవరు? వాసుదేవ్ గతం ఏంటి? అనే విషయాల గురుంచి కథ ఉంటుంది.
కొత్త కుర్రాళ్ళ దమ్మున్న దర్శకత్వం: సుజీత్ మరియు సందీప్ జె.ఎల్. దర్శకత్వం వహించిన ఈ సినిమా, సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో ఒక అద్భుతమైన ప్రయత్నం చేశారు. దర్శకులు ప్రేక్షకులను కథలో పూర్తిగా ముంచెత్తే విధంగా కథను నర్రేట్ చేశారు. హిప్నోటిజింగ్ సీక్వెన్స్‌లు, ఫ్లాష్‌బ్యాక్‌లు, మరియు ట్విస్ట్‌లు కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ప్రేక్షకులు అందరినీ ఆ ‘ క ‘ సినిమా ప్రపంచం లోకి తీసుకెళ్ళారు.
నటనతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బావరం: కిరణ్ అబ్బవరం అభినయ్ వాసుదేవ్ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు. అతని నటనలోని పరిణతి, అతని కళ్ళలోని భావోద్వేగాలు, మరియు అతని శారీరక భాష అన్నీ కలిసి అతని పాత్రను మరింత బలపర్చాయి, కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇచ్చారు అని చెప్పాలి. నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సినిమా నీ ముందుకు తీసుకెళ్ళే విషయం లో పాలు పంచుకున్న టెక్నికల్ విభాగాలు: సామ్ సీఎస్ సంగీతం అద్భుతంగా ఇచ్చారు. ప్రతి సన్నివేశానికి సరిగ్గా సరిపోయేలా సంగీతం అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ కూడా కళాఖండంలా ఉంది. ఎడిటింగ్ కూడా అద్భుతంగా ఉంది. సినిమా యొక్క పేస్ ఎప్పుడూ తగ్గలేదు.
సినిమాలో సానుకూల అంశాలు:
- కథ
- దర్శకత్వం
- నటన
- సంగీతం
- సినిమాటోగ్రఫీ
- ఎడిటింగ్
సినిమాలో కొన్ని ప్రతికూల అంశాలు:
- కొన్ని సన్నివేశాలు అతిగా ఉన్నట్టు అనిపించింది.
- కొన్ని ట్విస్ట్‌లు అంచనా వేయవచ్చు.
ముగింపు:
“KA” ఒక అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్. ఇది ఒక సినిమా కంటే ఎక్కువ. ఇది ఒక మంచి అనుభవం. ప్రతి సినిమా ప్రేమికుడు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.
గమనిక: ఈ సమీక్ష సినిమాను చూసిన తర్వాత వ్రాయబడింది. ప్రతి ఒక్కరి అభిప్రాయం వ్యక్తిగతమైనది. కాబట్టి మీరు సినిమాను చూసి మీ స్వంత అభిప్రాయాన్ని ఏర్పరుచుకోండి.